జగిత్యాల జిల్లా – మెట్టపల్లి : బతుకుదెరువు కోసం ఖండాంతరాలు దాటి సౌదీకి వెళ్లిన ఓ వ్యక్తి, అక్కడ పడరాని పాట్లు పడుతున్నాడు. విదేశంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా వీడియో సందేశంలో ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. తమ కుమారుడిని భారత్కు రప్పించాలని కోరుతున్నారు.
ఉన్న ఊరిలో ఉపాధి లేకపోవడం, జగిత్యాల జిల్లా మేడిపల్లి కి చెందిన అనుముల సురేష్ ఆరు నెలల క్రితం సౌదీకి వెళ్లాడు. పనిలేకుండా రూమ్ లో పడేసి నరకయాతన పెడుతున్నారని, చిత్రహింసలకు గురిచేస్తున్నారని బాధితుడు రోదిస్తున్నాడు. సౌదీలో నరకయాతన అనుభవిస్తున్నానని వీడియో సందేశంలో సమాచారం అందించడంతో కుటుంబ సభ్యలు మనోవేదనకు గురౌతున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని తమ సురేష్ ని సురక్షితంగా స్వదేశం రప్పించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.