- విశాలాంధ్ర చిట్టిబాబుపై తహశీల్దార్,ఎస్ఐ లకు పిర్యాదు
అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలంలో విశాలాంధ్ర విలేకరి అగతంబిడి చిట్టిబాబు నుంచి కాపాడాలని మండలానికి చెందిన ట్రాక్టర్ల యజమానులు తహశీల్దార్ రాజ్యలక్ష్మి కి అలాగే స్తానిక ఎస్ఐ సతీష్ కుమార్ లకు విడి విడి గా పిర్యాదు చేసినట్లు ట్రాక్టర్ల యూనియన్ నాయకులు గడ్డంగి సూరిబాబు, తాంగుల రవి, అషోక్ లు పత్రిక ప్రకటన ద్వారా వారు తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, విశాలాంధ్ర చిట్టిబాబు పోన్ చేసి డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేశారని తెలియజేసారు. దాంతో పది వేల రూపాయిలు పోన్ పే ద్వారా చెల్లించమన్నారు. చిట్టిబాబు మరలా పోన్ చేసి మేము 18 మంది విలేకర్లు ఉన్నామని కావున రూ. 1,20,000 (ఇక లక్షా ఇరవై వేల రూపాయలు) కావాలని డిమాండ్ చేశాడు అంతడబ్బు మేము ఇవ్వలేము అనడంతో విశాలాంధ్ర, ఆంధ్రప్రభ దినపత్రికల్లో అక్రమ ఇసుక తవ్వకాలు కథనాన్ని ప్రచురించారు. ఆ కథనాలు పూర్తిగా అవాస్తవం మేము డబ్బు ఇవ్వలేదన్న అక్కస్సు తోటే అలా రాసారాన్నారు. JCB లతో ఇసుక సేకరిస్తున్నట్లు, స్టాకు పాయింట్లు ఏర్పాట్లు చేసుకొన్నట్లు, విచ్చల విడిగా అమ్ముకొంటున్నట్లు ప్రచురించారు. ట్రాక్టర్ లోడ్ అర యూనిట్ మాత్రమే వస్తుంది ట్రాక్టర్ కి లోడ్ చేయడానికి JCB లు అక్కర్లేదన్నరు, లేబర్ తో సేకరిస్తూన్నమన్నారు, అదికూడా ఎవరైనా వ్యక్తిగత నిర్మాణ దారులు మాత్రమే ఒకటి లేదా రెండు లోడ్ లు అడుగుతారు నెలలో 4-5 లోడ్లు రావడమే గగణమన్నారు. నిత్యం వయ దిగుడిపుట్టు మీదుగా అనేక లారీలు, టిప్పర్లు తో ఇసుక తరలి పోతుంది వారిపై విలేకర్లు ఎందుకు నిఘా వేయలేదన్నారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లా ట్రాక్టర్ల మీద పడడం విచారకరం అన్నారు. అనేక గిరిజన ప్రజా సమస్యలు పక్కనపెట్టి ట్రాక్టర్ల మీద విలేకర్లు పడడం వెనక ఆంతర్యం ఏమిటో అర్థం కాలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విలేకర్ల బారి నుండి గిరిజన ట్రాక్టర్ల యూనియన్ ని కాపాడలన్నారు.
ఈ కార్యక్రమంలో ట్రాక్టర్ యజమానులు అప్పారావు, రవి, వెంకటస్వామి, మధు, అశోక్ కుమార్, తులసీరావు తదితరులు పాల్గొన్నారు.