- మహిళా అభ్యున్నతే ధ్యేయంగా పని చేసిన సంఘ సంస్కర్త “సావిత్రిబాయి పూలే”.
- స్త్రీ సాధికారత కోసం , వారి హక్కుల కోసం కృషి చేసిన సావిత్రి బాయి జీవితం ఆదర్శప్రాయం
- వారు చూపిన మార్గాన్ని అనుసరించడమే వారికి మనం ఇచ్చే నివాళి.
- నేడు సావిత్రి బాయి ఫూలే వర్దన్తి సందర్భంగా మాట్లాడిన
- వైఎస్ఆర్ తెలంగాణ నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గ కో ఆర్డినెటర్ బుస్సాపూర్ శంకర్
నిజామాబాద్ : మహిళల అధికారాలు, విద్య కోసం సమాజంలో సరికొత్త చైతన్యాన్ని మేల్కొలిపిన గొప్ప సంఘ సంస్కర్త సావిత్రి బాయి ఫులే గారి వర్ధంతి సందర్భంగా ఈ రోజు YSR తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని ITI కాలేజిలో సావిత్రి బాయి ఫూలే గారి విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా YSR తెలంగాణ పార్టీ నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ బుస్సాపూర్ శంకర్ గారు మాట్లాడుతూ కుల, మత వివక్ష లేకుండా మహిళాభ్యుదయానికి కృషి చేసిన సంఘ సంస్కర్త, దేశంలో బాలికలకు ప్రత్యేకంగా తొలి పాఠశాల నెలకొల్పిన విద్యావేత్త శ్రీమతి సావిత్రి బాయి ఫులె వర్ధంతి గారు అని ఆ మహనీయురాలికి నమస్సుమాంజలులు తెలియజేస్తున్నామన్నారు.
ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతీరావ్ ఫులే భార్య అని కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి అని అన్నారు.
ఆమె ఆధునిక విద్య ద్వారానే స్ర్తీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన సావిత్రిబాయి గారు భర్తతో 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించారన్నారు.
కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారన్నారు.
నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం ఫణంగా పెట్టి సమష్టిగా పోరాటం చేసారని
నేటి తరం వారు , వారి యొక్క త్యాగాలను , పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకుని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరాలన్నారు
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్ టి విభాగం అధ్యక్షులు మోహన్ నాయక్ , జిలా యువజన విభాగం అధ్యక్షులు అంకార్ గణేష్ , జిల్లా ఐ టీ విభాగం అధ్యక్షులు చంద్రకాంత్ , పార్టీ నగర అధ్యక్షులు కాస్తూరి ప్రవీణ్ ,బీసీ విభాగం నగర అధ్యక్షులు కారంపూరి రవి కుమార్ , సీనియర్ నాయకులు సన్నిథ్ గౌడ్ , శ్రీశాంత్ తదితరులు పాల్గొన్నారు