పల్నాడు జిల్లా కారంపూడి పట్నంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో సైబర్ నేరగాళ్లు ఎకౌంట్ హోల్డర్స్ యొక్క ఖాతాల నుంచి డబ్బులు మాయం చేస్తున్నారు. అధికారులకు కంప్లైంట్ చేయటం తప్ప ఏమి చేసేది లేదు అంటున్న బ్యాంకు సిబ్బంది. ఖాతాదారులు ఎవరు ఎకౌంటు నుంచి ఎంత డబ్బు పోతుందో అయోమయంగా ఉంది. సెల్ ఫోన్ కి మెసేజ్ వస్తే కానీ అర్థం కావడం లేదు. పలువురు ఎకౌంట్లో ఇలాగే మాయం అయినట్లు చెబుతున్న బ్యాంకు సిబ్బంది. ఆధార్ హ్యాకింగ్ వల్లనే డబ్బులు మాయం అవుతున్నాయని బ్యాంక్ సిబ్బంది అంటున్నారు. అఖాతాదారుల డబ్బు మాయమైన వారి వివరములను సేకరించి లిఖితపూర్వకముగా కంప్లైంట్ తీసుకొని పై అధికారులకు తెలిపామంటున్నారు. ఈ విషయం పై సైబర్ క్రైమ్ పోలీసువారికి ఫిర్యాదు చేయకుండా బ్యాంకు సిబ్బంది నిర్లక్షంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. గతం లో పలుమార్లు ఖాతాదారుల ఖాతాల నుండి డబ్బులు మాయమైనప్పటికీ కారంపూడి బ్యాంకు సిబ్బంది చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా బ్యాంకు సిబ్బంది పోలీసు ఉన్నధికారులకు ఫిర్యాదు చేసి బాధితులకు న్యాయం జరిగేవిధంగా చూడాలని బాధిత కుటుంబాలు కోరుతున్నారు.