కర్ణాటక – హొసపేటె: కుల దూషణ, అట్రాసిటీ కేసులో 98 మంది దోషులకు జీవిత ఖైదు విధిస్తూ కొప్పళ జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించింది. పెనాల్టీ జిల్లా న్యాయమూర్తి (కొప్పళ జిల్లా మేజిస్ట్రేట్) సి. చంద్రశేఖర్ ఈ సంచలన తీర్పు ఇచ్చారు. ఈ గొడవ 2014 ఆగస్టు 28న గంగావతి తాలూకా మరకుంబి గ్రామంలో జరిగింది. గంగావతి రురల్ పోలీస్ స్టేషన్ మొత్తం 117 మంది మీద ఛార్జ్ షీట్ దాఖలు చేసారు. వీరిలో చాలామంది చనిపోయారు. పదేళ్ళపాటు సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయస్థానం ఛార్జ్ షీట్ లోని నిందుతులందరు దోషులందరు దోషులని తేల్చింది. 101 మందిని దోషులుగా నిర్దారించింది కోర్టు. వీరిలో ముగ్గురు ఎస్సి, ఎస్టీ వర్గానికి చెందినవారు. వారికి ఐదేళ్లు జైలుశిక్ష, ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల జరిమానా విధించింది కోర్టు.