- డొంగ పోరంబోకు భూమి తనకా పెట్టి కుటుంబ సభ్యుల పేరుతో లోను తీసుకున్న వైనం
- ఇటీవల ఇదే స్థలంపై రైతులు ఆందోళన
పల్నాడు జిల్లా కారంపూడి : స్థానిక మండల కేంద్రమైన కారంపూడిలో భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో ఎక్కడ స్థలం కనబడితే అక్కడ భాగా వేసి యదేక్షంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. కారంపూడి డిస్కవరీ స్కూల్ పక్కన డొంక పోరంబోకు భూములు కొందరు గ్రామకంఠం సర్వేనెంబర్ వేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ స్థలంపై ఇక్కడ రైతులు సైతం ఆందోళన చేయడం జరిగింది. దీనిపై విచారణ కూడా జరపవలసిందిగా స్థానిక తాహశీల్దార్ ను కలెక్టర్ ఆదేశించినప్పటికీ తమకు ఏమి కాదు అన్నట్లుగా ఒక వ్యక్తి తన భార్య పేరుతో పిడుగురాళ్ల బ్రాంచ్ శ్రీరామ్ సిటీ యూనియన్ బ్యాంక్ లో ఈ భూమి మీద ఐదు లక్షల(5,00000) రూపాయలు తీసుకున్నట్లు తెలిసింది. అంతేకాకుండా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని ప్రశ్నించిన రైతులపై గతంలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇంత జరుగుతున్న రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఈ డొంక పోరంబోకు భూమిని ఆక్రమించి వేరే సర్వే నెంబర్ తో రిజిస్ట్రేషన్ చేపించుకున్నారని ఆ ప్రాంత రైతులు జిల్లా ఎస్పీ కి, జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేసినప్పటికీ ఆక్రమణదారుల ఆగడాలు ఆగడం లేదు. సాక్షాత్తు జిల్లా కలెక్టర్ విచారణలో ఉన్న ఈ భూమిని తమ సొంత భూమి లాగా తనకా పెట్టడం చూస్తుంటే స్థానిక అధికారులు కూడా ఈ ఇతనికి వత్తాసు పలుకుతున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ వ్యక్తి ఏకంగా దొంగ సర్వే నెంబర్ తో రిజిస్ట్రేషన్ చేపించుకొని ప్రభుత్వ భూములను తనకా పెట్టడం అన్యాయమని రైతులు వాపోతున్నారు. ఇలాంటి వారిపై తక్షణం చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేపడతాం అని ఆ ప్రాంత రైతులు హెచ్చరిస్తున్నారు.
విచారణ చేపడతాం తహశీల్దార్ జి శ్రీనివాస్ యాదవ్
బ్యాంకులు రెవెన్యూ శాఖ క్లియరెన్స్ ఉంటేనే రుణాలు ఇవ్వాలని గతంలో చెప్పడం జరిగిందన్నారు. పిడుగురాళ్లకు సంబంధించిన ప్రైవేట్ బ్యాంకు శ్రీరామ్ సిటీ యూనియన్ బ్యాంక్ ప్రభుత్వ స్థలానికి ఎలా రుణం ఇచ్చారో విచారణ జరుపుతామని ఆయన అన్నారు.