కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రంలోని విజ్ఞాన్ హై స్కూల్ లో ఘనంగా సైన్స్ డే నిర్వహించడమైనది. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు వివిధ రకాల విజ్ఞాన ప్రదర్శన ప్రదర్శించారు, ఇట్టి విజ్ఞాన ప్రదర్శనలో 35 మంది విద్యార్థులు విద్యార్థులు వారి వారి ప్రతిభను కనబరిచారు, సివి రామన్ ప్రత్యేకతలను తెలియజేశారు. సైన్స్ డే గొప్పతనము ప్రపంచము సైన్స్ యొక్క ఆధారంగా ఇలా పనిచేస్తుంది అనే విషయాన్ని తెలియజేశారు, ఉత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులు విద్యార్థులకు పాఠశాల కరస్పాండెంట్ ప్రిన్సిపాల్ చేతుల మీదుగా ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ బూర వెంకటేశ్వర్, ప్రిన్సిపాల్ భాను చైతన్య, వైస్ ప్రిన్సిపాల్ లత, ఉపాధ్యాయ బృందం లతా, మమత, సంతోష్ కుమార్, నాందేవ్, మమత, శిరీష,శ్వేత, వర్షిత, లాస్య, విద్యార్థుల విద్యార్థులు పాల్గొన్నారు.