గ్రేటర్ విశాఖపట్నం: 67వ వార్డు సాయిరాం నగర్ గాజువాక లో గల స్వామి విద్యానికేతన్ హై స్కూల్ ఆవరణంలో భారత్ స్కౌట్స్ మరియు గైడ్స్ రాష్ట్ర కార్యాలయం వారు విశాఖపట్నం స్కౌట్ లకు తృతీయ సోపాన పరీక్షా శిబిరం నిర్వహించమని ఆదేశించారు జిల్లా కార్యవర్గం వారు 19వ తేదీ నుండి ఈనెల 22వ వరకు ఎవరి స్కూలులో వారే పరీక్ష నిర్వహించుకుని 23వ తేదీన గ్రాండ్ టెస్ట్ కు జిల్లా పరిషత్ హై స్కూల్ తోట గురువు లో విద్యార్థులందరినీ హాజరు కమ్మని ఆదేశించిన కారణంగా మొదటి రోజు స్వామి విద్యానికేతనలో స్కౌట్ పతాకావిష్కరణ గావించి ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరిగింది.
ఈరోజు అనగా రెండవ రోజు ప్రధమ సోపానం పరీక్ష నిర్వహించి టెంట్ నిర్మాణం ఫ్లాగ్ ఫోల్ నిర్మాణం స్వచ్ఛభారత్ కార్యక్రమాల్లో భాగంగా సాయిరాం నగర్ వీధి రోడ్లు శుభ్రపరచడం జరిగింది అదేవిధంగా స్వామి విద్యానికేతన్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్డు ప్రక్కన గల మొక్కలను ట్రిమ్మింగ్ చేయించడం జరిగింది పాఠశాల పరిసరాలలో క్లీన్ చేసి బ్లీచింగ్ చల్లడం జరిగింది నీటి కుళాయిల చుట్టూ సుబ్రపరిచారు.
తృతీయ సోపానం సంసిద్ధం కావాలంటే స్కౌట్ విద్యార్థులకు ఖచ్చితముగా వంట చేయుట ఒక రాత్రి శిబిరంలో నివాసం గడుపుట పది మైళ్ళు కాలినడకను హైకు చేయుట మరియు అనేక రకాలు ముడులు నిజజీవితంలో ఉపయోగపడేవి నేర్చుకొనుట రాత్రి వేళల్లో చుక్కలను చూసి దిక్కులను చెప్పగలుగుట కొలవకుండా వ్యక్తులు వెడల్పులను మదించటం జండాలను ఉపయోగించి మోర్స్ మరియు సమా ఫోర్ పద్ధతులలో సమాచారములు పంపుట ఇంకను అనేక రకములైన ప్రధమ చికిత్స విధానములు నేర్చుకుని ఉండవలెను 19వ తేదీ అనగా మొదటి రోజు ప్రవేశ పరీక్ష జరుగుతుండగా డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ కమిషనర్ శ్రీ వేణుగోపాల గారు సందర్శించి స్కౌట్లను ఆశీర్వదించారు
అదేవిధంగా జిల్లా ఆర్గనైజింగ్ కమిషనర్ శ్రీ ఎస్వీ రమణ గారు తదుపరి మిగతా రోజులు కార్యక్రమాలు ఏ ఏ విధాలుగా చేయాలో పిల్లలకు వివరించారు.
ఈ కార్యక్రమం మొత్తం సామీ విద్యానికేతన్ హై స్కూల్ ప్రిన్సిపల్ మరియు అడ్వాన్స్ కౌంట్ మాస్టర్ మరియు హెచ్ డబ్ల్యు బి స్కౌట్స్ డాక్టర్ పాలూరు లక్ష్మణస్వామి ఆధ్వర్యంలో జరిగినట్లు స్కూల్ కరెస్పాండెంట్ పీ దేవి గారు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో సహకరించినటువంటి ఉపాధ్యాయులు జి పద్మజ, లక్ష్మి , స్వర్ణ శ్రీ , గైడ్ టీచర్ టీ సూర్య కుమారి మరియు సీనియర్ స్కౌట్స్ కు అభినందనలు తెలియజేశారు