- గుండారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివిన 9 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు
- అభినందించిన సిపిఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హన్మoడ్ల భాస్కర్
సిద్దిపేట జిల్లా: తాము విద్యాబుద్ధులు నేర్పిన గుండారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వపు విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం అభినందనీయమని సిపిఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హన్మoడ్ల భాస్కర్ అన్నారు. బెజ్జంకి మండలంలోని గుండారంలో ఉన్నత పాఠశాలలో చదివిన 9 మంది జతనం రూపేష్, ఏఆర్ కానిస్టేబుల్ గౌరీ ప్రేమ్ నర్సింగ్ ఆఫీసర్ గుంటి సతీష్ సివిల్ కానిస్టేబుల్ కర్రావుల హర్షవర్ధన్ జీవశాస్త్ర ఉపాధ్యాయుడు బొల్లి శివప్రసాద్ ఎస్జిటి ఉపాధ్యాయుడు గొడ్డటి అనిల్ ఏఈఈ అర్కాల రాజు ఆర్మీ జిడి గొడ్డటీ చందు బిఎస్ఎఫ్ బోప్పేన శ్రీకాంత్ టి ఎస్ ఎస్ పి లలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించగా ఆదివారం గుండారం ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అందుబాటులో ఉన్న జతనం రూపేష్ గౌరీ ప్రేమ్ కర్రావుల హర్షవర్ధన్ బొల్లి శివప్రసాద్ గుంటి సతీష్ లను సిపిఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హన్మoడ్ల భాస్కర్ తనతో పాటు పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయులు రెడ్డి సుజన పొన్నం వనిత పాము చంద్రశేఖర్ లతో కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం హన్మoడ్ల భాస్కర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో కష్టపడి చదివి ఒకే పాఠశాల నుండి 9 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు తమ గ్రామానికి పేరు తీసుకువచ్చారని అన్నారు. ఇష్టంతో చదివితే అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారని అన్నారు. తమ విద్యాబుద్ధులు నేర్పిన విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తే గురువుల ఆనందానికి అవధులు ఉండయని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఉద్యోగంలో మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు రెడ్డి సుజన పొన్నం వనిత పాము చంద్రశేఖర్ ఉద్యోగం సాధించిన జతనం రూపేష్ గౌరీ ప్రేమ్ గుంటి సతీష్ కర్రవుల హర్షవర్ధన్ బొల్లి శివప్రసాద్ పూర్వపు విద్యార్థులు సాన వేణు సాన రమేష్ అర్కాల శ్రీకాంత్ గుంటి సంతోష్ రంగు శశిధర్ పండుగ రాజు అనుష తదితరులు పాల్గొన్నారు.