- బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామచంద్రం
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న 2వ రోజు సమ్మెలో వారి న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని బహుజన్ సమాజ్ పార్టీ మద్దతు తెలిపింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిశాని రామచంద్రం, అసెంబ్లీ నాయకులు నిశాని రాజమల్లు, సీనియర్ నాయకుడు కొంపెల్లి పర్శరాములు మరియు బెజ్జంకి మండల స్థాయి నాయకులు అద్యక్షులు మాతంగి తిరుపతి, ఉపాధ్యక్షులు కాంపెల్లి నరేష్, ప్రధాన కార్యదర్శి లింగాల తిరుపతి, రెగులపల్లె సెక్టార్ అద్యక్షులు నిశాని సురేష్, బేగంపేట సెక్టార్ అద్యక్షులు మిట్టపెల్లి రామచంద్రం, ఇంఛార్జి ఉప్పులేటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.