నిర్మల్ జిల్లా : ఖానాపూర్ నియోజకవర్గం కండెం మండలాల సరిహద్దును ఆదివాసీ గిరిజన ప్రజలకు వ్యయ ప్రయాసల దూరం తగ్గిచి విద్య వైద్యంకి పేద ప్రజలు త్వరగా చేరుకునేల గంగపూర్ మరియు ఎర్వచ్చింతల్ వంతెన అంచనా విలువ 2215.00 లక్షలు, నిర్మాణానికి రాష్ట్ర పంచాయతీ రాజ్, శిశు సంక్షేమ మంత్రి వర్యులు శ్రీమతి శ్రీ దనసరి అనసూయ (సీతక్క),ఖానాపూర్ ఎమ్మెల్యే బోజ్జు పటేల్ , ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ ఖానాపూర్ నియోజకవర్గంలోని కడెం,ఖానాపూర్ మండలాల్లోని మారుమూల ఆదివాసీ గిరిజన గ్రామాలకు నిత్యావసర రోడ్డు మార్గం..ఇది వారి ఎన్నో దశాబ్ధాల కాల నిరీక్షణకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో తెరపడుతుందని అన్నారు . ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.