హైదరాబాద్ : ఎల్బీనగర్ చౌరస్తాకు శ్రీకాంతాచారి పేరు పెడుతున్నట్లు ప్రకటించారు మంత్రి కేటీఆర్. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి ఇక్కడే ఆత్మహత్యాయత్నం చేశాడని కూడా గుర్తు చేశారు కేటీఆర్. ఆయనకు గుర్తుగా ఎల్బీనగర్ చౌరస్తాకు శ్రీకాంతాచారి పేరు పెడతామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ నిర్ణయంపై ప్రజలు, ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎవరు ఎన్ని దుష్ప్రచారాలు చేసిన అమరవీరులను కేసీఆర్ ప్రభుత్వం ఎప్పటికి మరిచిపోరని కామెంట్స్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో శ్రీకాంత్ చారి తల్లి కూడా స్పందించింది. ‘నా కొడుకు త్యాగానికి ఇది సరైన నిర్ణయం. తెలంగాణ కోసం ఎల్బీనగర్ చౌరస్తాలో నా కొడుకు పెట్రోల్ పోసుకుని మాంసం కరగపెట్టుకున్నాడు. అయితే కేటీఆర్ చేసిన పనికి మా కొడుకు ఆత్మా శాంతిస్తుంది. నా మనసు కూడా తృప్తి పడింది. చనిపోయిన నా కొడుకుకు మళ్ళీ ప్రాణం పోసినట్టు నాకు అనిపిస్తుంది’ అంటూ భావోద్వేగం అయ్యారు అమరుడు శ్రీకాంత్ చారి తల్లి శంకరమ్మ.