పటాన్ చేరు:
పటాన్ చేరు పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ అబ్దుల్ బాసిత్ బహుజన సాహితి అకాడమీ వారు ప్రతి ఏటా నిర్వహించే అవార్డుకు ఎన్నికైనట్లు నేషనల్ అవార్డు సేలక్షన్ కమిటీ చైర్మన్ నల్ల రాధాకృష్ణ అవార్డు ఎంపిక ఆహ్వాన పత్రాన్ని సోమవారం రోజున హైదరాబాదులోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో అందించినట్లు తెలిపారు.ఆయన మాట్లాడుతూ నవంబర్ 13వ తేదీన దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగే ఆల్ ఇండియా బహుజన రైటర్స్ మూడవ నేషనల్ కాన్ఫరెన్స్ లో దేశ నలుమూలల 26 రాష్ట్రాల నుండి సుమారు 2000 మంది డెలిగేట్స్ పాల్గొంటారని తెలిపారు.ఈ అవార్డు ప్రతిఏటా ప్రజా ఉద్యమకారులు,సంఘ సేవకులకు,కవులకు,పత్రిక రంగంల వారికి స్వచ్చాంద సేవా సంస్థలకు ఈ అవార్డు అందజేస్తారని తెలిపారు.విద్యార్థి దశ నుండి చేపట్టిన సామాజిక ఉద్యమాలు,సామాజిక అవగాహన కార్య్రమాలు పాత్రికేయుడిగా గ్రామీణ ప్రాంతాలలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వంకు,ప్రజలకు వారధిగా అనేక వార్తలను అందించి ప్రజా సమస్యల పరిష్కారం నా వంతుగా కృషి చేసిన సందర్భంగా బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ, ఈ అవార్డుకు ఎంపిక చేయడం పట్ల నేషనల్ సేవా రత్న అవార్డు రాకతో సమాజంపై మరింత సేవ చేసే అవకాశం భుజాలపై మరింత బాధ్యత గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు తెలవడం జరిగింది.ఈ అవార్డుకు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎం ఎం గౌతమ్, రాష్ట్ర కో ఆర్డినేటర్ హనుమాండ్ల విష్ణు,రాష్ట్ర ఉప అధ్యక్షుడు సామ్రాట్ గోవర్ధన్, దళిత రత్న ఏర్పుల శ్రీనివాస్,కరుణాకర్,శ్రీశైలం, తదితరులు పాల్గొన్నారు.