పల్నాడు జిల్లా కారంపూడి లో బస్టాండ్ సెంటర్ భారీ వర్షానికి జలమయమైంది. డ్రైనేజీ వాటర్ రోడ్డుపైకి వచ్చి బస్టాండ్ సెంటర్ మొత్త నీటి కుంటలా తయారైంది. దోమలు పెరిగిపోతున్నాయి. డ్రైన్ వాటర్ కూడా వర్షపు నీటితో కలవడం వలన భరించలేని వాసన, దోమ కాటుకు గురై ప్రజలు అనారోగ్య బారిన పడే అవకాశముంది. అధికారులు మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నారే తప్ప చర్యలు తీసుకోవడం లేదు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.