- డ్యూటీలో ఉన్న పోలీసులపై భౌతిక దాడి చేసి ఫ్యాక్షనిజాన్ని ప్రదర్శించిన వైయస్ విజయలక్ష్మి రెడ్డి షర్మిలారెడ్డిలు
- నిశ్శేష్టులై తిలకించిన ప్రజానీకం
- భారతదేశంలో బలవంతులది ఒక తీరు బక్కోళ్లది ఒక తీరు ఇదేనా సాంఘిక సమానత్వం?
హైదరాబాద్ : హౌస్ అరెస్ట్ లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి భార్య విజయలక్ష్మి రెడ్డి కుమార్తె షర్మిల రెడ్డిలు డ్యూటీలో ఉన్న పోలీస్ సిబ్బందిపై భౌతిక దాడి చేశారు సిఐ ఎస్ఐ తదితర సిబ్బందిపై భౌతిక దాడి చేశారు ఈ సంఘటనలో పోలీసులు విజయలక్ష్మి, షర్మిలను .. పోలీసులు అమ్మగారు మేడం అనుకుంటూ ప్రాధేయపడ్డారు సామాన్యంగా వారి మాటకు ఎదురుచెప్పిన బక్క రిక్షా ఆటోవాలా నుండి తాగుబోతులు వ్యభిచారులు హంతకులు రౌడీషీటర్లు వరకు జుట్టు పట్టుకుని ఈడ్చుకు వెళ్లి అన్ని డిగ్రీలలో ఎముకలువిరిచి గోళ్లుపీకి వేలాడదీసి చావు కేక పెట్టించే పోలీసులు వీళ్ళ విషయంలో బతిమాలు కొని ప్రాధేయపడి తన్నులు తినటం స్థానిక ప్రజానీకాన్ని తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది భారతదేశంలో బలవంతులకు ఒక విధానం బక్కోళ్లకు ఒక విధానం అమలు చేసే పోలీసుల విషయంలో ప్రజలు తీవ్ర అసహనానికి లోనయ్యారు
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేయడంపై ఆమె తల్లి విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల టెర్రరిస్టు కాదు, ఉద్యమకారిణి కాదని అన్నారు. సిట్ కార్యాలయానికి షర్మిల వెళ్తే తప్పేమిటని ప్రశ్నించారు. ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నందుకు షర్మిలను వేధిస్తున్నారని మండిపడ్డారు. షర్మిల వ్యక్తిగత స్వేచ్ఛను కూడా హరిస్తున్నారని మండిపడ్డారు. షర్మిల ఎక్కడకీ వెళ్లకూడదా అని ప్రశ్నించారు. షర్మిల డ్రైవర్ పై కూడా దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో వైఎస్ రాజశేఖరెడ్డి ఆశయాల సాధన కోసమే షర్మిల పార్టీ పెట్టిందని అన్నారు.
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద తాను పోలీసును కొట్టానంటూ టీవీ ఛానళ్లలో చూపిస్తున్నారని విజయమ్మ అసహనం వ్యక్తం చేశారు. పోలీసులు తనపై పడుతుంటే కోపం రాదా అని ప్రశ్నించారు. తాను నిజంగా కొట్టాలనుకుంటే గట్టిగా కొట్టేదాన్నని అన్నారు. తాను కొట్టలేదని, చేత్తో అలా అన్నానంతేనని చెప్పారు. వాస్తవాలను ప్రజలకు తెలపాల్సిన బాధ్యత మీడియాకు ఉందని అన్నారు.