కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని కనపర్తి గ్రామంలో సుమారుగా 250 సం॥ల క్రితం పురాతన నిర్మించిన శివాలయ శిథిలదశకు చేరుకున్నందున, దాన్ని పునరుద్ధరించాలనే గ్రామ ప్రజల కోరిక మేరకు ‘ మహాకళ ‘ వంశీయులు ముందుకు వచ్చి పునరుద్ధరణ పనులు చేపట్టడం జరిగింది. ఏప్రిల్ మొదటి వారంలో ధ్వజస్థంభ ప్రతిష్టాపన, వేడుకలు నిర్వహించేందుకు ప్రణాలిక తయారు చేసి స్థానిక పౌరోహితులు గూడ జగదీశ్వర శర్మ.సూచనల ప్రకారం ప్రతీ పనిని శాస్త్ర ప్రకారం చేయడం జరుగుచున్నది. నిర్వహణ ఖర్చుల కొరకు మహాకళ సాంబశివరెడ్డి,మహాకళ సుగుణాకర్ రెడ్డి, మహాకళ మహేందర్ రెడ్డి ఒక్కొక్కరు రెండు లక్షల చొప్పున విరాళంగా ఇచ్చి ప్రోత్సహించగా ఇంద్రారెడ్డి, సదాశివ రెడ్డి,వీరసేనారెడ్డి , దేవేందర్ రెడ్డి,డా,ఇంద్ర సేనారెడ్డి,రవీందర్ రెడ్డి,చంద్ర ప్రకాష్ రెడ్డి,శ్రీరాంరెడ్డి, రాజిరెడ్డి, దామోదర్ రెడ్డి,శ్రీనివాసరెడ్డి, రాంరెడ్డి,ముకుంద రెడ్డి, రాంగోపాల్ రెడ్డి,కిషన్ రెడ్డి , గోపాల్ రెడ్డి,రాజేందర్ రెడ్డి. మహిపాల్ రెడ్డి,శ్యాం సుందర్ రెడ్డ,రజనీకర్రెడ్డి ప్రతి ఒక్కరు 50 వేల రూ. ముందుకు వచ్చి వారిధాతృత్వాన్ని ప్రకటించి నందుకు కమిటీ సభ్యులు, గ్రామప్రజలు ధన్యవాదాలు తెలియజేశారు.