contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి : ఎస్సై నరసింహారావు

కరీంనగర్ జిల్లా: లయన్స్ క్లబ్ ఆఫ్ గన్నేరువరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్సై చందా నరసింహారావు అన్నారు. మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అక్యుప్రెషర్ అండ్ మ్యాగ్నెటిక్ తెరపి చికిత్స శిబిరాన్ని ఎస్సై చందా నరసింహారావు శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈనెల 5వ తేదీ నుంచి ఉచిత వైద్య శిబిరాన్ని మండల కేంద్రంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జోన్ చైర్మన్ బొడ్డు సునీల్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు కొండల్ రెడ్డి, వైస్ ఎంపీపీ న్యాత స్వప్న సుధాకర్, ఉప సర్పంచ్ బూర వెంకటేశ్వర్, బూర రామకృష్ణ, మీసాల ప్రభాకర్, మరియు వారి బృందం  పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :