కరీంనగర్ జిల్లా: గణతంత్ర వేడుకల సందర్భంగా గన్నేరువరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాల బాలికలకు కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై చందా నరసింహారావు ముఖ్యఅతిథిగా హాజరై ఈ పోటీలను ప్రారంభించారు. చదువుతోపాటు క్రీడలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈకార్యక్రమంలో నాయకులు బొడ్డు సునీల్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.