కరీంనగర్ జిల్లా: కేశవపట్నం మండలం: పోలీస్ సంక్షేమ సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మామిడాల సురేందర్ మంగళవారం కేశవపట్నం ఎస్సైగా పదవి బాధ్యతలు చేపట్టారు. మొన్నటి వరకు 20 నెలలుగా గన్నేరువరం ఎస్ఐగా విధులు నిర్వహించి కరీంనగర్ రిజర్వుకు బదిలీ కాగా మంగళవారం రోజున కరీంనగర్ సిపి సుబ్బారాయుడు ఆదేశాల మేరకు కేశవపట్నం ఎస్సైగా బాధ్యతలు చేపట్టారు.గతంలో చిగురుమామిడి తదితర మండలాల్లో ఎస్సైగా విధులు నిర్వహించారు 1989 లో కానిస్టేబుల్ గా పోలీస్ ఉద్యోగంలో చేరి నీతి నిజాయితీలతో ఎంతో కష్టపడి విశిష్ట సేవలు అందించి పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులచే మన్ననలు పొంది హెడ్ కానిస్టేబుల్ నుండి ఏఎస్ఐ ఎస్ఐ వరకు ఎన్నో ప్రభుత్వ అవార్డులను పొందారు.