- ఎస్సై మోసం చేశాడని యువతి ఆరోపణ
గుంటూరు పట్టణం లో నగరంపాలెం పోలీసు స్టేషన్ ఎస్ఐ రవితేజ తనను మోసం చేశాడంటూ షకీనా అనే యువతి గతంలో స్పందనలో ఫిర్యాదు చేశారు.
శనివారం తాడేపల్లి ఐద్వా కార్యకర్తలను షకీనా కలిసి అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఎస్ఐ ప్రేమ పేరుతో మోసం చేసి..ఇప్పుడు ఎవరికైనా తమ ప్రేమ గురించి చెబితే చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఆరోపించారు.
కులంపేరు చెప్పి పెళ్లికి నిరాకరిస్తున్నాడని అన్నారు. అతనితోతనకు పెళ్లి చేయాలని ఆమె కోరుతున్నారు