జగిత్యాల జిల్లా కోరుట్ల పోలీసు స్టేషన్ లో ఎస్ ఐ -2 శ్వేత ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ ఐజి చంద్రశేఖర్ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఓ యువకునిపై చేయి చేసుకోవడంతో మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్య యత్నం చేసి చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనిపై అధికారులు విచారణ చేపట్టి నివేదిక ఆధారంగా ఎస్సై శ్వేత ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.