- సిద్ధప్పకు తగిన గుర్తింపునిచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
- జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పిడిశెట్టి రాజు
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గోల్కొండ కవి సిద్ధప్ప వరకవికి రాష్ట్ర ప్రభుత్వం తగిన గుర్తింపు ఇచ్చిందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పిడిశెట్టి రాజు అన్నారు. గురువారం నియోజకవర్గ కేంద్రంలోని కోహెడ మండలం కూరేళ్ల గ్రామంలో 39వ, వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించగా వారి చిత్రపటానికి గ్రామ సర్పంచ్ గాజులు రమేష్ ముఖ్య అతిథిగా హాజరై పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సిద్ధప్ప వరకవి రాసిన నాలుగు భాగాల్లోని పద్యాలను ఇంటర్ ద్వితీయ సంవత్సరం తెలుగులో “జ్ఞానబోధ” పేరుతో పాఠ్యాంశంగా ముద్రించడం సంతోషకరమన్నారు. సిద్ధప్ప రచనలు నేటి యువతకు ఆదర్శమన్నారు. ఆయన ఈ ప్రాంతానికి చెందినవాడు కావడం మన అదృష్టంగా భావించాలన్నారు. తన రచనల ద్వారా సమాజ మూఢత్వాన్ని ముక్కుసూటిగా ఖండించిన సిద్దప్ప 1984 వ సంవత్సరం మార్చి 23న తనువు చాలించారన్నారు. చిన్న తనం నుండే సాహిత్యం పట్ల అభిమానం కల్గిన వీరు సరస్వతీ కటాక్షంతో 40 వరకు గ్రంథాలను రచించారు. తెలుగు సాహిత్య చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ‘తెలంగాణ తొలి సమాజ కవి’గా, ’తెలంగాణ వేమన’గా వెలుగొంది ‘గోల్కొండ కవి’గా “గోల్కొండ కవుల సంచిక”లో ఒకరిగా వెలుగొందుతున్నారు. తెలుగు సాహిత్య చరిత్రలో శాలివాహన కులం నుండి మొల్ల తర్వాత సిద్దప్ప అంతటి ప్రాచుర్యం పొందారు. సాహిత్యంతో పాటు జ్యోతిషం,వాస్తు,ఆయుర్వేదం,యోగ విద్యల్లో ప్రావీణ్యం సాధించి తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకలో భక్తులను, అభిమానులను చూరగొన్నారు. వీరి రచనల్లో “సిద్దప్ప వరకవి జ్ఞాన బోధిని” నాలుగు భాగాలు విస్తృత ప్రజాధరణ పొందిందని గుర్తు చేశారు. సిద్ధప్ప ప్రధాన శిష్యులు నాంపల్లి రామయ్య ను సర్పంచ్ రమేష్ ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో కూరేళ్ల గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు మార్గం తిరుపతి, గాజుల రవీంధర్, బండారి నరేష్ నాయకులు కొండేటి నగేష్, పొన్నాల రవీంధర్, కోనవేని రవి, బండారి కిష్టయ్య, చిట్యాల కొమురయ్య, సిద్దప్ప శిష్యులు రాములు, జాగిరి శ్రీనివాస్, దొంతుల భూపతి తదితరులు పాల్గొన్నారు.