సిద్ధిపేట జిల్లా / ధూల్మిట్ట / లింగాపూర్ : తమ తోటి చదువుకున్న చిన్ననాటి స్నేహితుడు మీసా నరసింహులు ఇటీవల అకాల మరణం చెందడంతో, స్నేహితుని కుటుంబానికి మేమున్నామంటూ చిన్ననాటి స్నేహితులు తన కుమార్తె పేరు మీద పోస్ట్ ఆఫీస్ లో కిసాన్ వికాస్ పత్రు పథకంలో 55వేల రూపాయలు పిక్స్ డిపాజిట్ చేసి బాండ్ ని ఆ కుటుంబానికి అందజేసి స్నేహాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దూల్మిట్ట జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 2005 పదో తరగతి బ్యాచ్ కి చెందిన చెందిన మిత్రులు, అలాగే చిన్న నాటి స్నేహితులందరు కలసి మృతుడు నరసింహ కుటుంబాన్ని ఆదుకున్నామని తెలిపారు. అలాగే సహకరించిన ప్రతి ఒక్కరి కుటుంబానికి కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం ల సెవెళ్ల సంపత్, సెవెళ్ల కృష్ణ , వినోద్ , చిరంజీవి, సాగర్, రమేష్,రాజు అశోక్ తదితరులు పాల్గొన్నారు.