తిరుపతి: స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద తిరుపతి నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి హరిత ఐ.ఏ.ఎస్. అధికారులను ఆదేశించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై మంగళవారం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ నగరంలో ఇప్పటికే పూర్తి అయిన ప్రాజెక్టుల నిర్వహణ చక్కగా ఉండేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు. అలాగే పనులు జరుగుతున్న ప్రాజెక్టులను ఎప్పటిక్పుడు తనిఖీ చేసి నాణ్యతతో పూర్తి అయ్యేలా చూడాలన్నారు. నగరంలో ముఖ్యమైన ప్రాజెక్టులు అయిన శ్రీనివాస సేతు, వినాయకసాగర్ , భూగర్భ విద్యుత్ కేబుల్ వంటి ప్రాజెక్టులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు ఈ సమావేశంలో జనరల్ మేనేజర్ చంద్రమౌళి, సూపరింటెండెంట్ ఇంజినీర్ మోహన్, ఈ ఈ చంద్రశేఖర్, డి.ఈ. మోహన్, ఏ.ఓ. రాజశేఖర్, ఏఈకాం ప్రతినిధి బాలాజీ, స్మార్ట్ సిటీ సిబ్బంది ఉన్నారు.