- సకాలంలో హాస్పిటల్ కు తరలింపు.
- 24గంటల హాస్పిటల్ లో వైద్య సిబ్బంది కరవు.
- వైద్యం అందక మృత్యువాత.
అల్లూరి జిల్లా,హుకుంపేట,ది రిపోర్టర్ : మండలంలో పట్టం గ్రామానికి చెందిన యువ రైతు శోభ హరినాద్ (35) వ్యవసాయ పని చేస్తుండగా పాము కాటుకు గురై చనిపోవడం జరిగింది. హుటాహుటిన ఉప్ప ఆస్పత్రికి తీసుకు వెళ్లిన వైద్యం సకాలంలో అందించకపోవడంతో చనిపోవడం జరిగిందని,పిహెచ్సి స్టాప్ ఎవరు లేకపోవడంతో బంధువు ఆవేదన వ్యక్తం చేశారు.పేరుకే 24గంటల హాస్పిటల్ కానీ అందుబాటులో వైద్య సిబ్బంది ఉండరని స్థానికులు ఆరోపిస్తున్నారు,అత్యాధునిక టెక్నాలజీ పెరుగుతున్న ఈ రోజుల్లో గిరిజన బ్రతుకులకు మెరుగైన వైద్యం ఇంకా అందని ద్రాక్ష గా మారిపోయింది, దింతో ఆదివాసీలు వారి బాధలు ఎవరితో చెప్పుకోవాలో అర్ధం కాక శతమ తం అవుతున్నారు, ఇప్పటికైనా పాలకులు, అధికారులు వైద్యం పూర్తి స్థాయిలో అందించాలని గిరి పుత్రులు వేడుకుంటున్నారు, అలాగే పెద్ద దిక్కు కోల్పోవడం వలన ప్రభుత్వ పరంగా ఆ కుటుంబానికి ఆదుకోవాలని బంధుమిత్రులు కోరడం జరిగింది.