- చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలోని ఓ అంగన్‌వాడీ కేంద్రంలో ఘటన
- పౌష్టికాహారం ప్యాకెట్‌ను ఇంట్లో విప్పి చూస్తే పాము కళేబరం కనిపించడంతో గర్భిణికి షాక్
- అంగన్‌వాడీ సూపర్‌వైజర్ సాయంతో సీడీపీఓకు బాధితురాలి ఫిర్యాదు
- ఘటనపై ఉన్నతాధికారులకు సమాచారమిచ్చామన్న సీడీపీఓ
- బాధితురాలికి మరో ప్యాకెట్ ఇవ్వాలంటూ గుత్తేదారును ఆదేశించామని వెల్లడి
ఏపీలోని చిత్తూరు జిల్లాలోని ఓ అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లలకు అందించే పౌష్టికాహారంలో పాకు కళేబరం వెలుగు చూసింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యెం మండలంలోని ఓ అంగన్‌వాడీ కేంద్రంలో ఘటన వెలుగుచూసింది. పౌష్టికాహారం ప్యాకెట్‌ను ఇంట్లో విప్పిచూడగా పాము కళేబరం కనిపించడంతో ఆ గర్భిణీ మహిళ ఒక్కసారిగా షాక్‌కుగురైంది. ఆ తర్వాత అంగన్‌వాడీ సూపర్ వైజర్ సాయంతో సీడీపీఓకు బాధితురాలు ఫిర్యాదు చేయగా, దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చామని సీడీపీఓ వెల్లడించారు.
బంగారువాలళ్యెం మండలం జంబువారిపల్లె పంచాయతీ శాంతినగర్‌లోని అంగన్‌వాడీ కేంద్రంలో మానస అనే గర్భిణీకి ఈ పౌష్టికాహార ప్యాకెట్‌ను ఇచ్చారు. ఇది ఖర్జూల ఫలాల ప్యాకెట్. దాన్ని విప్పి చూడగా, ఖర్జూలాలు ఎండిపోయివుండగా, అందులే పాము కళేబరం కనిపించింది. ఈ దృశ్యంతో అవాక్కైన మహిళ అంగన్‌వాడీ కేంద్రం సూపర్ వైజర్‌కు ఫిర్యాదు చేశారు.
Boult Audio Z40 True Wireless in Ear Earbuds with 60H Playtime, Zen™ ENC Mic, Low Latency Gaming, Type-C Fast Charging, Made in India, 10mm Rich Bass…
Deal Price : ₹997 – M.R.P.: ₹4,999
https://amzn.to/46ExPgp