- డ్రైవర్ కు తీవ్ర గాయాలు
- స్పందించని 108 వాహనం
- సంఘటన 5.30 కి పోలీసులు 7.30
- బైపాస్ లో ఇసుక లారీ ఎందుకు ఆగి ఉంది ?
- అక్రమమా … సక్రమమా .. ఇసుకా
ప్రకాశం జిల్లా చీమకుర్తి బైపాస్ ఎన్ఎస్పి కాలనీ సమీపంలో ఆగి ఉన్న ఇసుక లారీని కొరియర్ వాహనం ఢీకొనడంతో డ్రైవర్ కి తీవ్ర గాయాలయ్యాయి.
నిత్యం వందలాది వాహనాలు ప్రయాణించే చీమకుర్తి బైపాస్ రోడ్ లో శనివారం ఉదయం సుమారు 5.30 గంటల ప్రాంతంలో విజయవాడకు చెందిన డిసిఎం (TCI EXPRESS ) వాహనము ( AP 39 TS 6148 ) పొదిలి వైపు వెళుతుండగా చీమకుర్తి బైపాస్ మార్గం మధ్యలో ఆగి ఉన్న ఇసుక లారీని ( AP 27 UB 6667 ) ఢీ కొనింది. డిసిఎం లారీ క్యాబిన్ నుజ్జునుజ్జయింది. డ్రైవర్ కరణ్ కు రెండు కాళ్లు విరిగి, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి.
సంఘటన స్థలానికి స్థానికులు హుటాహుటిన చేరుకొని సహాయక చర్యలు చేపట్టి డ్రైవర్ ని ఆసుపత్రికి తరలించారు. క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవరును బయటకు తీసేందుకు క్రేన్ సహాయంతో సుమారు గంటపాటు శ్రమించి డ్రైవర్ ని బయటకు తీశారు. నెత్తురుమడుగులో కొట్టుమిట్టాడుతున్న డ్రైవర్ ని ఆసుపత్రికి తరలించడానికి 108 అంబులెన్సు సకాలంలో రాకపోవడ తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. సుమారు రెండు గంటల పటు అంబులెన్సు కోసం ఎదురుచూడవల్సివచ్చింది.
సంఘటన 5.30 గంటలకు జరిగితే ఇక మన చీమకుర్తి పోలీసులు మాత్రం తీరిగ్గా 7.30 గంటలకు వచ్చారు. చీమకుర్తి సిఐ సేవలకు, ఫీల్డ్ మెడికల్ సేవలకు స్థానికులు .. శబాష్ పోలీస్ అండ్ మెడికల్ అంటున్నారు.
కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్న పోలీసులు మాత్రం ఈ కేసుని ఎటు తీసుకెళ్తారోనాని స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు.
అసలు బైపాస్ రోడ్డు లో ఇసుక టిప్పర్ ఎందుకు ఆగి ఉంది ? దేనికోసం అక్కడ ఆగింది ? ఇసుక లారీకి అక్కడ ఏమి పని ? అక్రమ ఇసుక తరలిస్తున్నాడా లేదా సక్రమంగా ఇసుక తరలిస్తున్నాడా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.