ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం నాగులప్పలపాడు మండలం ఉప్పుగుండూరు ఎస్సీ కాలనీకి చెందిన విద్యార్థిని మున్నంగి సుమ, గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ చదవడానికి అవసరమైన ఆర్థిక సహాయం కోరిన సంగతి తెలిసిందే.
ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే బి.ఎన్. విజయ్ కుమార్ సుమకు సహృదయంతో స్పందించి, 50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “పేద విద్యార్థులకు నా వంతు సాయం ఎల్లప్పుడూ ఉంటుందని, మునుముందు రోజుల్లో విద్యావసరాలకు సహాయార్థం ముందుంటానని” తెలియజేశారు.
సుమ ఈ సహాయానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, తన కలల కొరకు కృషి చేస్తానని హామీ ఇచ్చింది.
.