ప్రకాశం జిల్లా: సంతనూతలపాడు గ్రామపంచాయతీ పరిధిలోని పెద్ద బజార్‌లో ఉన్న పిచ్చియ్య హోటల్ సమీపంలో, శనివారం ఉదయం ఎక్సైజ్ శాఖ అధికారులు కొత్తగా కేటాయించిన మద్యం దుకాణానికి సంబంధించి కొలతలు వేస్తుండగా, స్థానిక మహిళలు మద్యం షాపు వద్దంటూ నిరసన వ్యక్తం చేశారు.
ఈ ప్రాంతంలో కోదండ రామ స్వామి ఆలయం, సాయిబాబా సత్సంగ కేంద్రం, నాగర్పమ్మ ఆలయం, గ్రంధాలయం, మహిళల టూషన్ సెంటర్ వంటి ప్రదేశాలు ఉన్నాయని. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ డిప్యూటీ తహసిల్దార్ ఎన్ మాబు సుభానికి వినతి పత్రం అందజేశారు
ఉమా శంకర్, ఎస్ సుధారాణి, ఎస్ వరలక్ష్మి, ఎస్ కేశవరావు, సిహెచ్ దాయి, ఎస్ మల్లేశ్వరరావు, పి గిరి, ఎస్ కొండ రావు, ఎస్ శ్రీనివాసరావు, పి సతీష్ నాళం, ప్రసాద్ తదితరులు ఈ నిరసనలో పాల్గొన్నారు.