- మెగా జాబ్ మేళా ఏర్పాటు చేసిన నిర్వాహకులు.
- పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు.
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మంత్రివర్యులు దామచర్ల ఆంజనేయులు 17వ వర్ధంతి ని పురస్కరించుకొని ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు విగ్రహావిష్కరణ, మెగా జాబ్ మేళా, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడం జరిగింది.
మల్లవరప్పాడులో ఎన్టీఆర్, దామచర్ల ఆంజనేయులు విగ్రహావిష్కరణ, తూర్పు నాయుడుపాలెంలో సబ్ స్టేషన్ కి శంకుస్థాపన చేసారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దామచర్ల జనార్ధన్, ఏలూరి సాంబశివరావు, ఇంటూరి నాగేశ్వరరావు, ముత్తుముల అశోక్ రెడ్డి, ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజీ , డా. గొట్టిపాటి లక్ష్మి, గూడూరి ఎరిక్షన్ బాబు, దామచర్ల సత్య, దివి శివరాం, నారపుశెట్టి పాపారావు తదితరులు పాల్గొన్నారు.