మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు వర్ధంతి సందర్భంగా ఆదివారం నాడు ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలో మెగా జాబ్ మేళా, మెడికల్ క్యాంపు నిర్వహించారు. మొదట మల్లవరప్పాడులో ఎన్టీఆర్, దామచర్ల ఆంజనేయలు విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం తూర్పునాయుడుపాలెంలో సబ్ స్టేషన్ నిర్మాణానికి , ఎస్సీ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ….. దామచర్ల ఆంజనేయులు సామాన్య రైతు కుటుంబంలో పుట్టి స్వయంకృషితో సర్పంచ్ స్థాయి నుంచి మంత్రి స్థాయికి ఎదిగి పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఈ ప్రాంత ప్రజల గుండెల్లో నిలిచిపోయారని అన్నారు. ఆయన నీతి, నిజాయితీ నైతిక విలువలతో రాజకీయాలు చేశారని, ఏ పదవి చేపట్టినా ఆ పదవికి వన్నె తెచ్చారని కొనియాడారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే రాష్ట్రంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. ఇచ్చిన హామీ మేరకు పింఛన్ రూ. 4 వేలకు పెంచాం, 16 వేల పోస్టులతో మెగా డీఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం. దీపావళి నుంచి మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందజేస్తాం. సూపర్ సిక్స్ హామీలు కూడా త్వరలోనే అమలు చేస్తాం. కొండపి నియోజకవర్గం తూర్పు నాయుడుపాలెంలో ఈ వంద రోజుల్లోనే సీసీ రోడ్ల నిర్మాణం, సబ్ స్టేషన్ నిర్మాణం చేపట్టాం. పేద ప్రజలపై భారం లేకుండా సోలార్ విద్యుత్ అందిస్తామన్నారు. తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని సైతం వైసీపీ నేతలు కల్తీ చేశారని, తప్పులు చేసి బు కాయించటం వైసీపీ నేతలకే చెల్లిందన్నారు.
గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ..
జగన్ అధికారం వచ్చేంతవరకు జనం లో ఉన్నాడని,అధికారం వచ్చిన తర్వాత ప్యాలెస్ నుండి బయటకు రాకుండా పరిపాలన చేశాడని అందుకుగాను ప్రజలు అతను తిరస్కరించారని ,ప్యాలెస్ కి పరిమితం చేశారని వంద రోజుల్లో ఇట్లాంటి అద్భుతమైన పరిపాలన చూసి ఓర్వలేక ముఖ్యమంత్రి పైన తెలుగుదేశం పార్టీ పైన బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, గత ప్రభుత్వంలో చేసిన తప్పుల వల్లే 150 స్థానాల నుండి 11 స్థానాలకు పరిమితం చేసి జనం చీ కొట్టిన తన వైఖరి మార్చుకోలేదనీ విమర్శించారు.
ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ కొండేపి నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లిన దామచర్ల ఆంజనేయులుకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుందని, రాష్ట్ర మంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ఆయన సేవలు తిరస్మరణీయమని తెలియజేశారు. ఆయన రాజకీయ వారసులుగా మేము కూడా అవినీతి మచ్చ లేకుండా రెండు నియోజకవర్గాల్లో సేవ చేస్తున్నామని తెలియజేశారు.
ప్రస్తుత జిల్లా రాజకీయాల గురించి మాట్లాడుతూ అధికారం కోల్పోయిన గాని కొంతమంది వైసీపీ నాయకులు వంద రోజులు కాకముందే జిల్లాలో ఆ పార్టీని బ్రష్టు పట్టించి, చంద్రబాబును తిట్టిన నోటితోనే ఇప్పుడు ఓటమినేతలలో ఒకరైన పవన్ కళ్యాణ్ కు జేజేలు కొట్టడానికి సిద్ధపడ్డారని , ఏ పార్టీలో చేరిన చేసిన అవినీతి నుండి, కేసుల నుండితప్పించుకోలేరని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో వారితోపాటు ఎంపీలు మాగుంట శ్రీనివాసరెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దామచర్ల జనార్ధన్, ఏలూరి సాంబశివరావు, ఇంటూరి నాగేశ్వరరావు, ముత్తుముల అశోక్ రెడ్డి, ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజీ , డా. గొట్టిపాటి లక్ష్మి, గూడూరి ఎరిక్షన్ బాబు, దామచర్ల సత్య, మాజీ ఎమ్మెల్యేలు దివి. శివరాం, నారపుశెట్టి పాపారావు, పోతుల రామారావు, కొండపి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.