ప్రకాశం జిల్లా/ నాగులుప్పలపాడు: సైబర్ నేరాలపై విద్యార్థినులు అవగాహన పెంచుకోవాలని, ఆకతాయిలు వేధిస్తే వెంటనే షీటీంలకు సమాచారం అందించాలని నాగులుప్పల పాడు ఎస్సై శ్రీనికాంత్ సూచించారు. సైబర్ నేరాలు, షీటీంలపై పోలీసు శాఖ ఆధ్వర్యంలో సోమవారం అమ్మనబ్రోలు ఎపి రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థినులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు సెల్ ఫోన్లకు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో చదివి తల్లిదండ్రుల కలలు సాకారం చేయాలని సూచించారు.
మహిళలు, విద్యార్థినుల రక్షణ కోసం షీ టీం ఏర్పాటు చేశామని, ఏదైనా ఆపదలో ఉంటే 100 నంబర్‌కు డయల్ చేయాలని సూచించారు. సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, ప్రిన్సిపల్ కే.మాధవి, సీత, ఆధ్యాపక సిబ్బంది, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ గద్దె మల్లయ్య, వైస్ చైర్మన్ రమణయ్య పాల్గొన్నారు.