- డ్రైవర్ కు తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం.
- ప్రకాశం జిల్లా చీమకుర్తి బైపాస్ ఎన్ఎస్పి కాలనీ సమీపంలో ఆగి ఉన్న ఇసుక లారీని కొరియర్ వాహనం ఢీకొనింది.
నిత్యం వందలాది వాహనాలు ప్రయాణించే చీమకుర్తి బైపాస్ రోడ్ లో శనివారం ఉదయం ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే విజయవాడకు చెందిన కొరియర్ వాహనము పొదిలి వైపు వెళుతుండగా చీమకుర్తి బైపాస్ మార్గం మధ్యలో ఆగి ఉన్న ఇసుక లారీని ఢీ కొనింది. కొరియర్ వాహనం యొక్క ముందు భాగం బాగా దెబ్బతినింది. డ్రైవర్ కరణ్ కు రెండు కాళ్లు విరిగి, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు స్పందించి దగ్గరలో ఉన్న క్రేన్ సహాయంతో డ్రైవర్ను బయటకు తీసి, పోలీసులకు సమాచారం అందించి , ఆస్పత్రికి తరలించారు.మండల కేంద్రంలో 108 ఎమర్జెన్సీ వాహనాలు అందుబాటులో ఉన్న రెండు గంటల సమయం అయినా కానీ స్పందించకపోవడం గమనార్హం.