కరీంనగర్ జిల్లా : అకాల వర్షాలకు గన్నేరువరం మండలంలో అపార నష్టం వాటిల్లింది. మండలంలో వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వారి ధాన్యం కొనుగోలు కేంద్రాలాకు అమ్మకానికి రైతులు వారి ధాన్యాన్ని కేంద్రాలకు తరలించారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వరి ధాన్యం తడిచిపోయింది. వర్షం నుంచి ధాన్యాన్ని కాపాడడానికి రైతులు ధాన్యంకుప్పలపై కవర్లు కప్పుకున్న ఈదురు గాలులకు అవి సైతం ఎగిరిపోవడంతో దాన్యం తడిసిపోయినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మామిడి తోటల్లో కాయలు నేలరాలాగా, వరి పంట నేల వాలిపోయింది, గింజలు సైతం రాలడంతో తీవ్ర నష్టం జరిగింది.
