- ప్రధానమంత్రి సూర్య గర్ ముఫ్ట్ బిజిలి యోజన కింద కామన్ సర్వీస్ సెంటర్ లో రిజిస్ట్రేషన్లు ప్రారంభం..
కరీంనగర్ జిల్లా: నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రధానమంత్రి సూర్య ఘర్ బిజిలి యోజనను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకానికి కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సి ద్వారా రిజిస్ట్రేషన్లు ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం రోజురోజుకు పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి సహజ వనరులను కాపాడుకోవడానికి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీ వినియోగాన్ని ప్రోత్సహించడంపై దృష్టి సారించింది, దీని కింద ఇప్పటికే సోలార్ గ్రూప్ టాప్ పథకాన్ని దేశవ్యాప్తంగా ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇందులో భాగంగా వినియోగదారుల ఇండ్ల పైకప్పులపై సోలార్ ప్లేట్లను అమర్చునున్నారు, దీని ద్వారా సౌర విద్యుత్ను వినియోగించుకోవడంతో పాటు కరెంటు బిల్లుల భారం కూడా తగ్గుతుంది. ఈ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని కామన్ సర్వీస్ సెంటర్ సిబ్బంది సౌజన్యంతో మొదలుపెట్టారు, ఆసక్తి కలిగిన వినియోగదారులు కామన్ సర్వీస్ సెంటర్ సిబ్బందికి తమ వివరాలను అందజేస్తే వారు ఆ వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారు, నమోదైన తర్వాత సంబంధిత అధికారులు సోలార్ ప్లాంట్లను ఇన్స్టాల్ చేస్తారు, ప్రజలు అత్యధిక సంఖ్యలో నమోదు చేసుకోగలరని కామన్ సర్వీస్ సెంటర్ జిల్లా డిఎం శ్రీధర్ తెలిపారు, మరిన్ని వివరాల కోసం దగ్గర్లోని కామన్ సర్వీస్ సెంటర్ ను సంప్రదించాలని సూచించారు, కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన తేళ్ల రవీందర్ మూడు కిలోవాట్ల సామర్థ్యం తో 9 సోలార్ ప్లేట్లను బిగించుకున్నారు, నెలకు దాదాపు 360 యూనిట్లు విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది, ఐకెపి మహిళ స్వశక్తి సంఘాల ద్వారా సబ్సిడీ పోను 1,60,000 లోను 60 నెలల కాల పరిమితితో తీసుకున్నట్లు తెలిపారు.