- కనీ పెంచిన పాపానికి తండ్రి పాలిట యముడయ్యాడు ఓ కిరాతక కొడుకు
- క్రికెట్ బ్యాట్ తో తలపై దాడి
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామానికి చెందిన అట్టికం శంకరయ్య (54)కు ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉండేవారు కొన్ని సంవత్సరాల క్రితం శంకరయ్య చిన్న కుమారుడు అనారోగ్య సమస్యతో మృతి చెందాడు. దీంతో శంకరయ్యకు ఉన్న ఆస్తి కొడుకు కూతురికి సమానంగా పంచగా ఇంకా కొంచెం భూమి ఉండటంతో తన పేరు మీద చేయాలని తండ్రి శంకరయ్యను కొడుకు రవికుమార్ ఒత్తిడి చేశాడని దీంతో శంకరయ్య భూమిని కూతురు పేరు మీద చేస్తా అనటంతో ఆగ్రహంగా ఊగిపోయిన కొడుకు రవికుమార్ రూమ్ లో ఉన్న క్రికెట్ బ్యాట్ తో దాడితో తండ్రి పై కిరాతకంగా దాడి చేయడంతో శంకరయ్య తీవ్ర గాయాల పాలయ్యారు, వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించే క్రమంలో మార్గ మధ్యలో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు, ఘటన స్థలానికి చేరుకున్న తిమ్మాపూర్ సిఐ పర్స రమేష్, గన్నేరువరం ఎస్ఐ మామిడాల సురేందర్ నిందితుని అదుపులోకి తీసుకొని మృతిని భార్య అట్టికం విజయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.