పల్నాడు జిల్లాలో జరిగిన హింసకు సంబంధించి దాదాపు 1200మందిని అరెస్టు చేశామని ఎస్పీ మలికా గార్గ్ తెలిపారు. వినుకొండలో ఆమె మాట్లాడారు. “పల్నాడు జిల్లా పేరు దేశ వ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చింది. చెడు ఘటనలతో ప్రచారంలోకి రావడం బాధిస్తోంది. జిల్లాలో ఇంత ఫ్యాక్షనిజం ఉందా?అని అని నా స్నేహితులు అడుగుతున్నారు. నరసరావుపేట జైలులో ఖాళీలేక రాజమహేంద్రవరం జైలుకు పంపుతున్నాం” అని ఎస్పీ అన్నారు.