- సేవ చేయడానికి స్థాయి అడ్డు కాదని, ఆపదలో ఉన్న వ్యక్తికి సహాయం చేసి మానవత్వాన్ని నిరూపించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏ ఆర్ దామోదర్.
- తక్షణమే స్పందించి మూర్ఛ వ్యాధి వచ్చిన వ్యక్తికి ప్రథమ చికిత్స చేయించి కాపాడిన జిల్లా ఎస్పీ …
- ప్రశంసించిన ప్రజలు
ఒకవైపు నిరంతరాయంగా విధులు, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజా రక్షణ, పరమావధిగా విధులు నిర్వహిస్తున్న ఒక జిల్లా స్థాయి అధికారి తన స్థాయి భేదాన్ని మరిచిపోయి ఆపదలో ఉన్న వ్యక్తికి తక్షణ ప్రథమ చికిత్స అందజేసి ప్రాణాలను నిలిపిన జిల్లా ఎస్పీ కి స్థానికంగా అభినందనలు తెలిపారు.
వివరాల్లోకి వెళితే ఈరోజు నాగులుప్పలపాడు మండలం, మద్దిరాలపాడు గ్రామంలో “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమం కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జిల్లాకు విచ్చేయుచున్న సందర్భంగా శుక్రవారం ఉదయం జిల్లా పోలీస్ కార్యాలయం నుండి మద్దిరాలపాడుకు వెళుతున్న మార్గ మధ్యలో ఒంగోలు వుడ్ కాంప్లెక్స్ వద్ద రోడ్డుపై నెల్లూరు జిల్లా, జలదంకి మండలం, 9వ మైల్ గ్రామంకు చెందిన బ్రహ్మయ్య (35 సం) తన ఊరు నుండి విజయవాడలో ఉన్న తన అక్క వద్దకు వెళ్ళడానికి రాత్రి బయలుదేరి ఒంగోలులో దిగారు. ఒంగోలు నుండి విజయవాడకు వెళ్ళడానికి రోడ్డుపై నిలబడి ఉండగా మూర్ఛ వచ్చి పడిపోయాడు. అటుగా వెళుతున్న జిల్లా ఎస్పీ ఆ వ్యక్తిని గమనించి తక్షణమే స్పందించి తన వాహనాన్ని నిలిపి దిగి అతని వద్దకు వెళ్లి పరిస్థితి గమనించి, చేతిలో తాళాలు పెట్టించి, ఆ వ్యక్తి స్పృహలోకి వచ్చిన తర్వాత మంచినీళ్లు స్వయంగా అందచేసి అతని పరామర్శించారు.
మూర్ఛ వ్యాధి కారణంగా ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్న వ్యక్తిని గమనించి అతని ప్రాణాలను నిలబెట్టడంలో ఎస్పీ చూపిన చొరవకు ఆ వ్యక్తి కన్నీటి పర్యంతమై ఎస్పీ , ఇతర పోలీసు అధికారులకు కృతజ్ఞతలు తెలుపుకోగా, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
జిల్లా ఎస్పీవెంట ఏ ఆర్ డీఎస్పీ చంద్రశేఖర్ మరియు జిల్లా సిబ్బంది ఉన్నారు.