contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఈ రోడ్డుకి మోక్షం ఎప్పుడో కథనానికి .. స్పందించిన అధికారులు

  • డోలి యాత్ర కథనానికి ..  కదిలిన జిల్లా యంత్రాంగం
  • చటకంబ నుండి చిడిమెట్టు, పూతిక పుట్టు నుండి జగడల మామిడి రోడ్డు పనులు పునః ప్రారంభం
  • రోడ్డు పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ , ఐటిడిఏ పీవో ఆదేశం
  • కదిలిన ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ అధికారులు
  • ది రిపోర్టర్ టీవీ కృషి కి అభినందనలు తెలిపిన ఆదివాసీలు

 

ది రిపోర్టర్ టీవీ ఫిబ్రవరి 26 న ఈ రోడ్డుకు మోక్షం ఎప్పుడు కలుగునో ? అన్న కథనానికి అధికారులు  స్పందించారు. చటాకంబ నుండి జగడల మామిడి,బోనూరు, చీడిమెట్టు, గడ్డి బంద, మెట్టువలస తదితర 9 గ్రామాలకు ఉమ్మడి విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.19 కోట్ల ఆరు లక్షల 45వేలను 22 కిలోమీటర్లకు నిధులు విడుదల చేశారు, RC. NO.467/BT. CC&WBM/Roads 2019-20. Dt:27-2-2020 ప్రొసీడ్ ఆర్డర్ ను ఉమ్మడి జిల్లా కలెక్టర్ నిధులు విడుదల చేశారు.  2021లో పనులు మొదలుపెట్టారు. ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. మధ్యలో పనులు నిలుపుదల చేశారు. రిపోర్టర్ టివి వరుస కథనాలతో జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవో స్పందించి 27 తారీకు నుండి రోడ్డు పనులు ప్రారంభించారు.

 

అల్లూరి జిల్లా,అనంతగిరి, ది రిపోర్టర్ టీవీ :  ఈ నెల 14వ తేదీ విశాఖపట్నం జిల్లా పరిషత్ పాలకవర్గం మీటింగ్ ఎదుట. మరియు 26వ తేదీన పూతకి పుట్టు గ్రామస్తులు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డోలి యాత్ర నిర్వహించి రోడ్డు పనులు మొదలు పెట్టకపోతే మార్చి 8వ తేదీన పాడేరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద డోలి యాత్ర నిర్వహిస్తామని తెలిపారు.  రిపోర్టర్ టీవీ వరుస కథనాలతో జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవో స్పందించి 27 తారీకు నుంచి రోడ్డు పనులు మొదలుపెట్టారు.

పోరాడి విజయం సాధించుకున్న 11 గ్రామాల ఆదివాసులు 2020 సంవత్సరంలో పెదకోట, కివర్ల, పీనకోట పంచాయతీ పరిధిలో గల కొండ శిఖర 11 గ్రామాలు బోనూరు,  చిడి మెట్టు, పూతీక పుట్టు, జగడల మామిడి, పందిరి మామిడి, గడ్డిబంద ఆదివాసులు మూడు నెలలు పాటు శ్రమదానంతో 12 కిలోమీటర్లు నిర్మాణం చేసుకున్నారు.  సిపిఎం అండతో జాతీయ మీడియాలో ప్రచురించిన కధనాలకు అధికార యంత్రాంగం రూ.20 కోట్ల రూపాయలు ఉపాధి పథకం నుండి నిధులు మంజూరు చేశారు.

దీనికి ఐ.టీ.డీ.ఏ నుండి మిషన్ కనెక్టివిటీ కార్యక్రమం ద్వారా ఎర్త్ వర్క్ నిమిత్తం రూ.50 లక్షల రూపాయలు విడుదల చేశారు. అలాగే మెటీరియల్ వర్క్ కింద రూ.20 కోట్లు మంజూరు చేశారు.  కానీ 2022 సంవత్సరంలో చల్లగడ్డ నుండి బొర్రపాలెం వరకు గ్రావెల్ రోడ్డు మాత్రమే నిర్మాణం చేశారు. గడ్డి బండ నుండి చీడిమెట్టు, నుండి బోనూరు గ్రామాల వద్ద రాళ్లు గుట్టలు వేసి వదిలేశారు.

ఈ విషయంపై అనేకసార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన పేమెంట్లు అవలేని కారణంగా రోడ్డు పనులు మొదలు పెట్టలేదని చెప్పారు. వాస్తవానికి గ్రావెల్ వర్క్ పూర్తయినట్టుగా జూలై నెల్లో కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించారు.
ఈ విషయం తెలుసుకున్న సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద అనంతగిరి మండల కేంద్రంలో డోలి యాత్ర ద్వారా నిర్వహించి మార్చి 8వ తేదీన రోడ్డు పనులు మొదలు పెట్టకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద డోలి యాత్ర నిర్వహిస్తామని పూతకు పుట్టు గ్రామంలో 26వ తేదీన నాలుగు కిలోమీటర్ల డోలి యాత్ర నిర్వహించడం జరిగింది.
ది రిపోర్టర్ టీవీ తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో జాతీయ స్థాయిలో కథనం ప్రచురించడం తో భారీ స్థాయిలో స్పందన లభించింది.  జిల్లా కలెక్టర్, పిఓ స్పందించి అధికారులతో  ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పనులు ప్రారంభించాలని ఆదేశించారు, దీనికి స్పందించిన  అధికారులు సోమవారం అర్ధ రాత్రి నుండి ఆగమేఘాల మీద పనుల్ని ప్రారంభించడం జరిగింది.  పోరాటం సాధించుకున్న గిరిజనులు ప్రత్యేకంగా ది రిపోర్టర్ టీవీ లోకల్ మీడియా వాళ్ళు కూడ అభినందనలు తెలిపారు.

ఈ రోడ్డుకు మోక్షం ఎప్పుడు కలుగునో..?

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :