contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

True Story: టివి పరిశ్రమలో శ్రమ దోపిడీ .. పట్టించుకోని అధికారులు

హైదరాబాద్ : హైదరాబాద్ బుల్లితెర ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ల ఆగడాలకు అంతులేకుండా పోతుంది . టివి సీరియల్స్ తీస్తున్న ప్రొడ్యూసర్లు, టివి ఇండస్ట్రీలో పని చేస్తున్న కార్మికుల హక్కులకు భంగం కలిగిస్తూ వారిచేత వెట్టి చాకిరి చేయించుకుంటున్నారు. ఒక్కో కార్మికుడు 18 గంటలు పని చేయవలసి వస్తుంది. పని ఒత్తిడి భారాన్ని తట్టుకోలేక మానసికంగా కృశించి అనారోగ్యంతో ఆస్పత్రుల పాలవుతున్నారు.

పండుగలు, ప్రభుత్వ సెలవు దినాలలో కూడా పని వత్తడి పెంచుతున్నారు. వారానికి ఒక రోజు కూడా సెలవు ప్రకటించడం లేదని కార్మికులు రోదిస్తున్నారు. తెలంగాణ ఫ్యాక్టరీస్‌, షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ చట్టాల ప్రకారం 2024 సంవత్సరంలో కర్మాగారాలు, దుకాణాలు, ఎస్టాబ్లిష్‌మెంట్స్‌లో పనిచేసే కార్మికులకు కూడా జాతీయ పండుగలు, ఇతర సెలవు దినాలను నిర్ధారిస్తూ కార్మికశాఖ డిసెంబర్ 19 – 2023 లో ఉత్తర్వులు జారీచేసింది. ఈ దినాల్లో కార్మికులకు వేతనాలతో కూడిన సెలవులు ఉంటాయని ఆ శాఖ అధికారులు తెలిపారు.

కానీ టివి ఇండస్ట్రీలో పని వేళలు ఆంటే తెలియదు. ఒక పద్దతి లేదు. ఒక వాయిస్ టేక్ తీసుకునే కార్మికుడి దగ్గరి నుండి వీడియో ఎడిటర్, కో ఆర్డినేటర్, డబ్బింగ్ వరకు ఉదయం 7.30 గంటల నుండి రాత్రి 10 నుండి 12 గంటల వరకు పని చేయాల్సి వస్తుంది. ఒకరంగా బానిస బతుకులు బతుకున్నారనే చెప్పుకోవచ్చు. ఎవరైనా అడిగితె వారిని పని నుండి తొలగిస్తారు. ఎక్కువగా పేద మధ్యతరగతి కుటుంబాలే కావడం వలన పని వత్తిడి భరిస్తు ఎవరికీ చెప్పుకోలేక మానసికంగా కృంగిపోతున్నారు. వారి సంక్షేమం, భద్రతకు సంబంధించిన పర్యవేక్షణ కరువైంది. ఉద్యోగ భద్రత, వేతనాల చెల్లింపు, ఆరోగ్య సంరక్షణ వంటి అంశాల్లో ప్రభుత్వాలు చట్టపరమైన రక్షణ కల్పించేందుకు భరోసా కల్పించినా.. కార్మిక శాఖ అధికారులు మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.

కొంతమంది టివి సీరియల్స్ నిర్మాతలు కళకారుల వేతనాలు కూడా నెలల తరబడి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సంక్రాంతి పండగ వస్తే వారం రోజుల ముందుగానే సెలవు దినాలు ప్రకటించి స్వంత గ్రామాలకు వెళుతున్నారు. గతంలో తెలంగాణ ప్రతిష్టాత్మకమైన బతుకమ్మ వేడుకలకు సెలవు ప్రకటించకుండా ఇంకొద్దిగా పని వత్తిడి పెంచుతున్నారనే ఆరోపణలు నిలువెత్తున ఉన్నాయి . ఆంధ్రా నిర్మాతలు తెలంగాణ లో వ్యాపారాలు చేసుకుంటూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని గౌరవించకుండా .. పని వేళలు ప్రకటించారు. తెలంగాణ భాషను వెక్కిరిస్తారు, యాసను వెక్కిరిస్తారు. అంటే అణచివేత ఎక్కడుంది ? మనకి కనబడేది ఒకటి ! చేస్తున్నది మరొకటి ! ఎవరు గమనించాలి ? ఎవరు తెలంగాణ బిడ్డల ఆర్తనాధాలు వినేది ? కార్మికులు ఏ రాష్ట్రంగా వారైనా కార్మికుల విషయంలో మరింత శ్రద్ధ వహించాలి. ఏ రాష్ట్రంలోనైనా నివసిస్తున్న వారందరి సంక్షేమం, భద్రత అక్కడి ప్రభుత్వానిదే. ఆ బాధ్యత తప్పక నిర్వహించాలి.

ముఖ్యమైన పండుగలు .. సంక్రాంతి, రిపబ్లిక్‌ డే, శివరాత్రి, ఉగాది, హోలీ , గుడ్ ఫ్రైడే , ఉగాది, రంజాన్‌, అంబెడ్కర్ జయంతి, శ్రీ రామ్ నవమి, మేడే, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, బక్రీద్ , స్వాతంత్య్ర దినోత్సవం, వినాయక చవితి, గాంధీ జయంతి, దసరా , దీపావళి, క్రిస్మస్ ముఖ్యమైన సెలవుదినాలు ప్రకటించకుండా కార్మికుల హక్కులను తుంగలో తొక్కుతున్నారు టివి సీరియల్స్ నిర్మాతలు.

ఇకనైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :