contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

Alluri Dist : మా గ్రామాల గోడు వినరా??

  • దశాబ్దాలుగా తీరని రహదారి సమస్య
  • అల్లూరి జిల్లా కలెక్టర్ కు స్పందనలో అర్జీ
  • స్పందన అర్జీ కీ…నేటితో ఎడాది పూర్తి
  • అర్జీ పై “స్పందన” కరవు!!
  • ఓట్లకై ఉన్నా తొందర – సమస్యలు తీర్చడంలో ఉండదా?

 

అల్లూరి జిల్లా, అనంతగిరి,ది రిపోర్టర్ టీవీ,ఎజన్సీ ప్రత్యేక ప్రతినిధి: ఉమ్మడి విశాఖపట్నం జిల్లా,విశాఖ మన్యంలో అనేక ఆదివాసీ,గిరిజన గ్రామాలకు నేటికీ రహదారి సౌకర్యం లేక అక్కడ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.

ప్రభుత్వాలు, పాలకులు మారిన కొన్ని గిరిజన గ్రామాల బ్రతుకు చిత్రం మారనేలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీ, గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు కేటాయిస్తున్న ఆ నిధులు చిట్ట,చివరి గ్రామాలకు
చేరకపోవడం గమనార్హం!!

దీనికి గల కారణం ఇక్కడ ప్రభుత్వలాది తప్పా?, స్థానిక పాలకుల చేతకాని తనమా?,  అధికారులు, ఉద్యోగుల నిర్లక్ష్యమా?, ప్రజల అమాయకత్వమా? అనేది అంతు చిక్కని ప్రశ్న?? విశాఖ మన్యం అంతా ఇదే పరిస్థితి.

ఆదివాసీ, గిరిజనుల కోసం ప్రత్యేక వ్యవస్థలు, చట్టాలు, పాలకులు, అధికారులు, ఉద్యోగులు ఉన్నప్పటికీ కనీస అవసరాలు అయినా త్రాగునీరు, రోడ్డు సౌకర్యాలు లేని గిరిజన గ్రామాలు కో కొల్లలు! స్వాతంత్రం వచ్చి 76ఏళ్ళు గడిచిన ఆదివాసీ, గిరిజన గ్రామాల ప్రజలు ఎతైన కొండ, కొనల్లో, లోయల్లో ఇంకా దుర్భర జీవితాలు నేటికీ గడుపుతునే వున్నారు.

అలాంటి ఆదివాసీ గిరిజన గ్రామాల గోడును బాహ్య ప్రపంచానికి పరిచయం చేసి సమస్యల పరిష్కారం కొరకు నడుం బిగించింది ది రిపోర్టర్ టీవీ దానిలో భాగంగానే అల్లూరి జిల్లా, అనంతగిరి మండలం పరిధిలో గల మారుమూల పెదకోట పంచాయతీలో మా ది రిపోర్టర్ టివి మారుమూల గ్రామాన్ని క్షేత్ర స్థాయిలో ప్రత్యక్షంగా సందర్శించి అందించిన పరిశోధనాత్మక కధనం.

వివరాలలోకి వెళితే…!!

అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకువాలీ నియోజకవర్గం, అనంతగిరి మండలానికి మారుమూల పెదకోట గ్రామ పంచాయతీ అవాస గ్రామలైన భూసి పుట్టు, ఇరుకు రాయి, గడ్డి బంధ, చింతలపాలెం, నూనెల మామిడి గిరిజన గ్రామాల్లో సుమారుగా 40నుండి 50కుటుంబాలు కలవు. వీళ్లంతా కొండపోడు, మెట్టు వ్యవసాయం చేసుకుంటూ అడవులపై ఆధారపడి ఎన్నో ఏళ్లుగా జీవనం సాగిస్తున్నారు, ఈ గ్రామాలు గ్రామ పంచాయతీ కేంద్రానికి సుమారుగా 15కిలోమీటర్ల దూరం ఉంటుంది, ఈ గ్రామాల నుండి ఎక్కడికి వెళ్ళాలన్నా కాలినడక తప్పనిసరి,అలాగే పెద్ద గెడ్డ ప్రవాహాని దాటాలి, నిత్యావసరాలు,డిపో బియ్యం అలాగే ఘర్భిణీ స్త్రీలను, అనారోగ్యంతో బాగులేని వాళ్ళను పినకోట ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకుని రావాలంటే కచ్చితంగా సమీప రహదారి వరకు డోలి కట్టాల్సిందేనని,వర్షాకాలం అయితే బాహ్య ప్రపంచానికి మా గ్రామాలకు ఎటువంటి సంబంధాలు ఉండవని గిరిజనులు ఆవేదనను వ్యక్తం చేశారు. ఇలా ఎన్నో ఏళ్ళ నుంచి తమకు అలవాటుగా మారిపోయిందని యువత, పెద్దలు,మహిళలు వాపోయారు. మా గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని అనేక సార్లు అధికారులకు,ప్రజా ప్రతినిధులకు వినతి పత్రాలు ఇచ్చిన మా గ్రామం వైపు తొంగి చూసే నాధుడే లేరని గిరిజనులు వాళ్ళ బాధను వెళ్ళగక్కారు.

శ్రమదానంతో రోడ్డు నిర్మాణం కై ప్రయత్నం:

సకాలంలో అనారోగ్యంతో ఉన్న వారిని, ఘర్భిణీ స్త్రీలను హాస్పిటల్ కు చేర్చక పొతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని, ప్రభుత్వాలు, నాయకులు, అధికారులు మమల్ని పట్టించుకొరని భావించి గ్రామాల్లో ఉన్న పెద్దలు,మహిళలు అంతా కలసి స్వచ్చందంగా నెలలు పాటు శ్రమించి దారికీ రెండు వైపులా చెట్లను,ముళ్ల పొదలను తొలగించి రెండు కిలోమీటర్లు రోడ్డు తవ్వుకున్నారు.

జిల్లా కలెక్టర్,ఐటీడీఏ, పిఓలకు”స్పందన”లో వినతులు ఇచ్చాం:

గ్రామం అంతా కలసి అల్లూరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ, పాడేరు, ప్రాజెక్ట్ ఆఫీసర్ అభిషేక్ లను కలిసి స్పందనలో 18 నవంబర్ 2022లో వినతి పత్రం ఇచ్చిన నేటికీ మా గ్రామాలకు ఎ ఒక్క అధికారులు రాలేదని,మా సమస్య పరిష్కారం కాలేదని గ్రామ యువకులు,పెద్దలు సప్పి దేముడు,సప్పి అప్పల స్వామి, సప్పి కన్నయ్య దొర,పి.గోపాల కృష్ణ, జి.రాంబాబు,ఎం. పండన్న తెలిపారు.

కలెక్టర్ సారూ… మాకు రోడ్డు మంజూరు చేయండి

అయ్యా అల్లూరి జిల్లా కలెక్టర్ గారు ఇకనైనా మా సమస్యలు, ఇబ్బందులను గమనించి మా గ్రామాలకు రోడ్డు మంజూరు కై చర్యలు చేపట్టి మా దుర్భర బ్రతుకులకు వెలుగులు నింపాల్సిందిగా గ్రామస్తులు కె.గాసన్న,ఎస్.పండన్న, పి. దేముడు, ఎస్.చిన్నయ్య,ఎస్. దేముడు,ఎస్.కన్నయ్యదొర, ఎస్.అప్పలస్వామి,పి.గోపాలకృష్ణ, బొజ్జయ్య,తౌడన్న, మహిళలు,పిల్లలు విజ్ఞప్తి చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :