సిర్పూర్ పేపర్ మిల్లు (జేక్) కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా, ఆరోగ్య సమస్యల కారణంగా మెరుగైన వైద్య సౌకర్యం కోసం హైదరాబాద్ ఈఎస్ఐసి హాస్పిటల్‌కు రిఫర్ చేయబడినప్పుడు, ఈఎస్ఐసి అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో, కార్మికులు ప్రైవేట్ అంబులెన్స్ కోసం సుమారు రూ. 15,000లు చెల్లించి అప్పుల పాలవుతున్నారు.
2018లో పేపర్ మిల్లు పునఃప్రారంభమైనప్పటికీ, ఆరేళ్ళు గడుస్తున్నప్పటికీ, కార్మికులకు ఈఎస్ఐసి అంబులెన్స్ సౌకర్యం అందుబాటులో లేదు. ఈ విషయంపై కార్మిక సంఘo నాయకులు గంభీరంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిఐఎస్‌ఎం (జేక్) కార్మిక సంఘo నేతలు, భూమయ్య, మల్లికార్జున్, రామ్ కి, శంషుద్దీన్, సతీష్ మరియు ఇతరులు ఈ సమస్యను ప్రధానంగా ఎత్తికొని, కాగజ్ నగర్ ఈఎస్ఐసి సూపర్డెంట్, జగన్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈఎస్ఐసి అంబులెన్స్ సేవలు అందుబాటులో లేకపోవడం వల్ల కార్మికులు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇంకా, అంబులెన్స్ డ్రైవర్‌గా ముగ్గురు మరియు క్లీనర్‌గా ఒక్కరు కొనసాగుతున్నప్పటికీ, వారు నెలసరి జీతం మరియు మెయింటెనెన్స్ చార్జీలను తీసుకుంటున్నారు.
ఈ సమస్యపై హైదరాబాదు రీజినల్ డైరెక్టర్ మరియు కాగజ్ నగర్ ఈఎస్ఐసి అధికారి తగు విచారణ చేపట్టి, ఈఎస్ఐసి అంబులెన్స్ సేవలను సరికొత్తగా ప్రారంభించాలని కార్మిక సంఘo నేతలు కోరుతున్నారు.