కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి లో గల మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల విద్యార్థి టీ కారుణ్య జాతీయస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ టి మహాలక్ష్మి తెలిపారు. శనివారం ప్రిన్సిపాల్ మహాలక్ష్మి పిఈటీ జ్యోతితో కలిసి కారుణ్యను అభినందించారు. తెలంగాణ హ్యాండ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 14న మహబూబ్ నగర్ లో రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అండర్ 12 విభాగంలోజాతీయ స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైంది. ఈ నెల తేదీ 21 నుండి 24 వరకు మహారాష్ట్ర లోని దాదర్ లో జరిగే 17వ జాతీయస్థాయి హ్యాండ్ బాల్ పోటీలలో పాల్గొంటున్నది. విద్యార్థి జాతీయస్థాయి ఎంపికకు కృషిచేసిన పిఈటి జ్యోతిని ప్రిన్సిపల్ మహాలక్ష్మి అభినందించారు. కారుణ్య ఎంపిక పట్ల పాఠశాల ప్రిన్సిపల్ మహాలక్మి హ్యాండ్ బాల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీను ముదిరాజ్, జిల్లా హ్యాండ్ బాల్ కమిటీ సభ్యులు హన్మoడ్ల భాస్కర్ ఆర్ సి ఓ గౌతమ్ రెడ్డి, పిఈటీ జ్యోతి,పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.