అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలోజాతీయ క్రీడా దినోత్సవం ఘనంగా నిర్వహించారు ముఖ్యఅతిథిగా మునిసిపల్ కమీషనర్ బి.జబ్బార్ మియా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించడం వల్ల మానసికోల్లాస అభివృద్ధికి తోడ్పడుతాయి క్రీడల పట్ల అత్యంత ప్రతిభ పట్టుదల కనబరచాలని తెలిపారు అనంతరం గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్ల ను అందజేయడం జరిగినది. గతంలో స్కూల్ పిల్లల ఉత్తీర్ణతలో రీజనల్ స్థాయిలో మంచి ప్రగతి ని సాధించిన స్కూల్ గా గుత్తి కేంద్రీయ విద్యాలయ ము పేరు ఘడించడములో ముఖ్య పాత్ర పోషించిన ఉపాధ్యాయులకు గౌరవ పురస్కారాలు కమీషనర్ చేతుల మీదుగా అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో పి.యం శ్రీ కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ యం.మల్కిసాబ్ బోధన సిబ్బంది స్కూల్ స్టాఫ్ మునిసిపల్ మేనేజర్ రాంబాబు మున్సిపల్ సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థుల తల్లితండ్రులు పాల్గొన్నారు.