కారంపూడి : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం మాచర్ల నియోజకవర్గం కారంపూడిలో బ్రాహ్మ నాయుడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 14 మరియు 17 సంవత్సరాల వయస్సు లోపు వారికి ఖో ఖో పోటీకి ఎంపికలు నిర్వహించారు. ఈ ఎంపికలకు నియోజకర్గo లోని అయిదు మండలాలా నుండి క్రీడాకారులు పాల్గొన్నారు. ఎన్నికైన టీమ్ లు జిల్లా స్థాయి ఖో ఖో పోటీలో తలపడనున్నారు. క్రీడాకారుల ఎన్నిక ప్రక్రియలో ప్రధాన ఉపాధ్యాయులు అనంత శివ, ఎంఈఓ కొరకంటి కాంతారావు, ఎంఈఓ రవికుమార్, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ గోపి, స్వర్ణ రాజు, జె శ్రీనివాస్ రావు, ఎక్స్మస్ జాను, అనిల్, కత్తి రవి, చిన్న రత్తయ్య, కర్తయ్య, కాలేశ్వరరావు, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.