కరీంనగర్ జిల్లా: సీఎం క్రీడా పోటీలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ లింగాల మల్లారెడ్డి, జెడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీఎం కప్పు టోర్నమెంట్ ను వారు ప్రారంభించారు, గ్రామీణ క్రీడలను ప్రోత్సహించేందుకు క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో ఎంపీడీవో స్వాతి, తహసీల్దార్ అనంత రెడ్డి, ఏఎస్ఐ లక్ష్మీనారాయణ, పిఈటి రాజబాబు,పిడి బాబు శ్రీనివాస్,ఎస్ఎంసి చైర్మన్ బుర్ర మల్లేష్ గౌడ్,వివిధ గ్రామాల ఎంపిటీసీలు, సర్పంచులు, నాయకులు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.
