నిజామాబాద్ జిల్లా – ఆర్మూర్ నియోజకవర్గంలో ఆలూర్ ,మాక్లూర్, నందిపేట్ మండలం సిహెచ్ కొండూరు గ్రామంలో ఎడతెరిపి లేకుండా ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షాల కారణంగా రైతులు ఆరబెట్టుకున్న వరి ధాన్యం మొలికిత్తడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇంత జరిగిన గాని కొనుగోలు కేంద్రాన్ని అధికారులు గాని నాయకులూ గాని సందర్శించలేదని రైతులు వాపోతున్నారు. అకాల “రాళ్ల” వర్షానికి వరి పంట నష్టపోయి రైతన్న కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కేసీఆర్ రైతే దేశానికి వెన్నుముక అంటూ జై జవాన్ జై కిసాన్ అన్నా నినాదం మర్చిపోయారా బంగారు తెలంగాణ చేస్తానంటివి రైతు కన్నీటి తెలంగాణగా మార్చావు అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వరి ధాన్యం కొనుగోలు వెంటనే ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేసారు. మరియు నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వ ఆదుకోవాలని పంటకు కనీస మద్దతు ధరను ప్రకటించాలని కోరారు, లేనియెడల రైతన్నలు రోడ్ ఎక్కే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.