- SRD, PTC భద్రకాళి సేవాసమితి స్థాపకుడు వడ్ల కిట్టు మరియు వారి సభ్యుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా హనుమాన్ విజయోత్సవం.
సంగారెడ్డి జిల్లా,పఠాన్ చెరువు నియోజకవర్గం: పఠాన్ చెరువు పట్టణంలో రాఘవేంద్ర కాలనీ చెన్నకేశవస్వామి మందిరం లో ఉన్న ఆంజనేయ స్వామి కి భద్రకాళి సేవా సమితి సభ్యుల సహకారంతో హనుమాన్ విజయోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే కే. సత్యనారాయణ, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, MDR ఫౌండేషన్ పృథ్వీ ముదిరాజ్, బిజెపి పటాన్చెరు అసెంబ్లీ కన్వీనర్ కొల్కూరి రాజశేఖర్ రెడ్డి ఇరువురు విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు, అనంతరం ఇరువురు మాట్లాడుతూ ఈరోజు హనుమాన్ విజయోత్సవం సందర్భంగా భద్రకాళి సేవ సమితి స్థాపకుడు వడ్ల కిట్టు మరియు వారి కమిటీ సభ్యులు హనుమాన్ జయంతిని అంగరంగ వైభవంగా నిర్వహించారు, వడమాలలు తమలపాకుల, మల్లెపూలల హారాలతో, పంచామృత అభిషేకాలు, సింధూరఅర్చకములతో చూడముచ్చటగా స్వామి వారిని అలంకరించి భక్తుల సమక్షంలో హనుమాన్ జయంతి విజయోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు, సుమారు 500 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూశారు, ఆంజనేయ స్వామి దయ కృప భద్రకాళి సేవ సమితి మరియు వాళ్ళ కమిటీ సభ్యుల పైన ఇక్కడికి వచ్చిన మహిళలకు భక్తులకు అందరి పైన ఉండాలని, భద్రకాళి సేవాసమితి స్థాపకుడు అర్థికంగా ఎదిగి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుతున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో భద్రకాళి సేవ సమితి స్థాపకుడు వడ్ల కిట్టు, లక్కదొడ్డి రాములు, పవన్ చారి, హరిశంకర చారి, రాచమర్ల ప్రభు, భాస్కర్ పంతులు, మాణిక్యం ముదిరాజ్, ఆనంద్ రెడ్డి, భక్తులు తదితరులు పాల్గొన్నారు.