సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు పట్టణం జెపి కాలనీ లో ఉన్న పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయానికి నూతన అధ్యక్షునిగా ఎన్నికైన కొండ మనోహర్ గుప్త వీరికి శుభాకాంక్షలు తెలిపిన మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా,గౌరవ అధ్యక్షుడు చంద్రశేఖర్ గుప్తా, మరియు దేవాలయ కమిటీ సభ్యులు, అనంతరం వారు మాట్లాడుతూ ఆలయ కమిటీ లో ఉన్న సభ్యులందరము కలిసి 13 సంవత్సరాల క్రితం పటాన్చెరు నియోజకవర్గం పరిధిలో కనివిని ఎరుగని రీతిలో శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం నిర్మించాము మేమందరం ఈ మందిరం నుండి ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి శ్రీరామనవమి అనేక హిందూ పండుగలను హిందూ బంధువులతో కలిసి సంస్కృత కార్యక్రమాలను నిర్వహిస్తాము , ఈ సంవత్సరం నూతన అధ్యక్షునిగా నాకు అవకాశం ఇచ్చిన మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా, గౌరవ అధ్యక్షులు చంద్రశేఖర్ గుప్తా మరియు కమిటీ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు అని, మా కమిటీ సభ్యులతో కలిసి ఆలయ అభివృద్ధి కోసం ఇక్కడ ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పారాయణం,అన్నదాన కార్యక్రమాలు ప్రత్యేక పూజలతో ఇక్కడికి వచ్చిన భక్తులకు ఆంజనేయస్వామి దర్శనము ఆశీర్వాదం ఇప్పించడం జరుగుతుంది, మన హిందూ బంధువుల సంస్కృత కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా, గౌరవ అధ్యక్షులు చంద్రశేఖర్ గుప్త, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు రాము గుప్త, మరియు కమిటీ సభ్యులు, ఇంద్రేశం గ్రామ మాజీ సర్పంచ్ బండి శంకర్, మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు.