సంగారెడ్డి జిల్లా , పటాన్చెరు: వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని భారతి నగర్, రామచంద్రపురం, అమీన్పూర్ మున్సిపాలిటీ, పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామాల పరిధిలో ఏర్పాటుచేసిన వివిధ వినాయక మండపాలను ఆదివారం పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మండపాల వద్ద ఏర్పాటు చేసిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలను ప్రారంభించారు. గణనాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.